సోమవారం 25 మే 2020
National - Apr 05, 2020 , 16:08:15

మ‌ర్క‌జ్‌తో లింకున్న‌ 8 మంది మ‌లేషియ‌న్ల అరెస్టు

మ‌ర్క‌జ్‌తో లింకున్న‌ 8 మంది మ‌లేషియ‌న్ల అరెస్టు

హైద‌రాబాద్: నిజాముద్దీన్‌లో మ‌ర్క‌జ్‌కు హాజ‌రై తిరిగి మ‌లేషియా వెళ్తున్న ఎనిమిది మంది విదేశీయుల‌ను ఇవాళ ఢిల్లీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. క‌రోనా వైర‌స్‌కు హాట్‌స్పాట్ అయిన త‌బ్లిగీ జ‌మాత్‌కు ఆ ఎనిమిది మంది మ‌లేషియ‌న్లు హాజ‌రైన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. వాస్త‌వానికి అంత‌ర్జాతీయ విమానాలు ప్ర‌స్తుతం ఆప‌రేట్ చేయ‌డం లేదు. కానీ కొన్ని దేశాలు స్పెష‌ల్ ఫ్ల‌యిట్ల‌ను న‌డిపిస్తున్నాయి. అయితే ఇవాళ మ‌లేషియాకు ప్ర‌త్యేక విమానం వెళ్తున్న సంద‌ర్భంగా..  మ‌ర్క‌జ్‌కు హాజ‌రైన 8 మంది ఆ విమానాన్ని ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌ వ‌చ్చారు. మ‌లిండో ఎయిర్ రిలీఫ్ ఫ్ల‌యిట్ ఎక్కాల‌నుకున్న వారిని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప‌ట్టుకున్నారు.  మ‌ర్క‌జ్‌కు హాజ‌రైన వారిని సెల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తిస్తున్నారు.  కేసు విచార‌ణ‌లో భాగంగా ఇవాళ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు మ‌ర్క‌జ్‌కు వెళ్లాయి.


logo