Bus Accident | దేశంలో ఇటీవలే బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఉన్నావ్ (Unnao) జిల్లాలో డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు (Double Decker Bus) అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హసన్పూర్ ప్రాంతంలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వే (Agra-Lucknow Expressway)పై బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు 60 మంది ప్రయాణికులతో ఆగ్రా నుంచి లక్నో వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి కూరగాయల లోడుతో వెళ్తున్న పికప్ వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు హై స్పీడ్లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
VIDEO | Uttar Pradesh: At least 20 passengers were injured when a double decker bus travelling from Delhi to Varanasi fell into a gorge on Lucknow-Agra Expressway near Unnao late last night. #UPNews #UttarPradeshNews
(Full video available on PTI Videos -… pic.twitter.com/tiAEUWyrDl
— Press Trust of India (@PTI_News) November 6, 2025
Also Read..
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం