Rajasthan | ఉత్తర భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌ను భారీ వర్షం ముంచెత్తింది. శనివారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జైపూర్, కరౌలీ, సవాయ్ మాధోపూర్, దౌసాలో వర్షం దంచికొట్టింది. ఇక ఈ వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ మేరకు జైపూర్, జైపూర్ రూరల్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, గంగాపూర్, భరత్పూర్లలో సోమవారం పాఠశాలలను మూసివేస్తున్నట్లు (Schools Shut) ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, వాగులు వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని సూచించారు.
Also Read..
Arvind Kejriwal | సీబీఐ అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్
Stock Markets | హిండెన్ బర్గ్ ఎఫెక్ట్.. నష్టాలతో ప్రారంభమైన సూచీలు
Katrina Kaif – Sunny Kaushal | మరిదిని పొగడ్తలతో ముంచెత్తిన కత్రినా కైఫ్