Katrina Kaif – Sunny Kaushal | బాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్ తన మరిది నటుడు సన్నీ కౌశల్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. తాను నటించిన సినిమా చాలా నచ్చిందని మళ్లీ రిపీట్‌గా చూస్తున్నట్లు తెలిపింది. బాలీవుడ్ భామ తాప్సీ పన్ను (Taapsee Pannu), విక్రాంత్ మాస్సే (Vikrant Massey), సన్నీ కౌశల్ (Sunny Kaushal) వచ్చిన చిత్రం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’(Phir Aayi Hasseen Dillruba). 2021లో మర్డర్ మిస్టరీ కథాంశంతో వచ్చి ఓటీటీలో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘హసీన్ దిల్రుబా’ అనే సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అయిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఆగష్టు 09 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తమ్ముడు సన్నీ కౌశల్ కీలక పాత్రల్లో నటించారు. అయితే తాజాగా ఈ సినిమా చూసిన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మూవీతో పాటు సన్నీ కౌశల్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీపై కత్రినా పోస్ట్ పెడుతూ..
‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ సినిమా చాలా బాగుంది. మువీ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది. ఈ మూవీని మధ్య మధ్యలో పాస్ చేస్తూ.. అందులో వచ్చే ట్విస్ట్‌లను నా భర్త (విక్కీ కౌశల్ ) చెప్పసాగను. ఈ సినిమా ఇంతటి విజయం సాధించి నందుకు కాంగ్రాట్స్ ఆనంద్ ఎల్ రాయ్, జయ్‌ప్రద్ దేశాయ్, తాప్సీ నీ నటన చాలా బాగుంది. జిమ్మి షెరిగిల్ నవ్వు చంపేశావు. విక్రాంత్ మాస్సే ఎప్పటిలాగే నీ యాక్టింగ్‌తో మరోసారి నిరుపించుకున్నావు. చివరిగా నా మరిది (సన్నీ కౌశల్).. మూవీ చూస్తుంటే సర్ప్రైజ్ అయ్యాను. నీలో ఈ యాంగిల్ కూడా ఉందని. మువీ చూస్తుంటే మీ వైపు ఆలోచిస్తే.. మీరు చెప్పేది సరైనది. మీరు ఎప్పుడు కరెక్ట్. అంటూ తన మరిదిపై ప్రశంసలు కురిపించింది కత్రినా.
Also read..