Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు తగ్గి 24,257కు చేరింది. సెన్సెక్స్ 339 పాయింట్లు నష్టపోయి 79,363 వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.95గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సెబీ ఛైర్‌పర్సన్‌పై హిండెన్ బర్గ్ (Hindenburg) చేసిన ఆరోపణల ప్రభావం సూచీలపై తీవ్రంగా పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ స్టాక్స్‌పై కనిపించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ విల్మార్తో పాటు ఏసీసీ, అంబుజా సిమెంట్స్ షేర్లలో క్షీణత కనిపించింది.
ఇక గత వారాన్ని మార్కెట్లు లాభాలతో ముగించాయి. శుక్రవారం నాడు ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ 819.69 పాయింట్లు ఎగబాకి 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250.50 పాయింట్లు అందుకొని 24,367.50 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరుల పంట పండింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.4,46,308. 99 కోట్లు పెరిగి రూ.4,50,21,816.11 కోట్ల(5.37 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే ఓలా షేరు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ.75.99 వద్ద ప్రవేశించిన కంపెనీ షేరు ధర 19.97 శాతం లాభంతో రూ.91.18 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.40,217.95 కోట్లుగా నమోదైంది.
Also Read..
Stampede | ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
Potato | గేమ్ చేంజర్.. బంగాళదుంపలతో గుండె పదిలం!
FORDA | కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్