FORDA | కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్లు భగ్గమన్నారు. హత్యను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది.
- ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటన
- కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై నిరసన
- దవాఖానల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్
FORDA | కోల్‌కతా, ఆగస్టు 11: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్లు భగ్గమన్నారు. హత్యను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది. ‘ఆర్జీ కర్‌లోని మా సహచరులకు సంఘీభావంగా సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఇది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎలాంటి జాప్యం లేకుండా తమకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నది. ఆర్జీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించాలని, నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని, అన్ని దవాఖానల్లో వైద్యుల భద్రతకు కేంద్రం ప్రొటోకాల్ విడుదల చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది.
నిందితుడిని పట్టించిన ఇయర్‌ఫోన్
కోల్‌కతాలో ఆర్జీ కర్ కాలేజీలో 28 ఏండ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్ డివైజ్ అతని మెడలో ఉంది.
40 నిముషాల అనంతరం బయటకు వచ్చేటప్పుడు అది అతడి మెడలో లేదు. కొంతసేపు పెనుగులాట తర్వాత డాక్టర్‌ను గొంతు పిసికి చంపినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడన్నారు. సంజయ్ రాయ్‌కు ఇదివరకే నాలుగుసార్లు పెండ్లిండ్లు అయ్యాయి. అయితే అతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోగా. నాలుగో భార్య గత ఏడాది మరణించింది. సంజయ్ రాయ్ పోలీస్ పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. పోకిరీ చేష్టలతో స్థానికులకు ఎప్పుడూ ఇబ్బందులు కలిగించేవాడని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

