Stampede | ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
బీహార్లోని (Bihar) జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఏడుగురు భక్తులు మృతిచెందారు.
పాట్నా: బీహార్లోని (Bihar) జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఏడుగురు భక్తులు మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. వారితో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన ఆలయానికి చేరుకుని భక్తుల్ని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
బాబా సిద్ధనాథ్ ఆలయ ప్రాంతాన్ని జెహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాండే సందర్శించారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుందని వెల్లడించారు. మరణించినవారి కుటుంబ సభ్యులను కలిసి విచారిస్తున్నామని, మరికొంత మంది మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సిద్ధనాథ్ ఆలయం వద్ద ఉన్న కొండపైకి ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తున్నది. అయితే భక్తులను నియంత్రించడానికి ఆలయ సిబ్బంది లాఠీచార్జి చేయడంతోనే ఆ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
Bihar | “At least seven people died and nine injured in a stampede at Baba Siddhnath Temple in Makhdumpur of Jehanabad district. We are monitoring everything and now the situation is under control, ” says Jehanabad DM Alankrita Pandey to ANI
— ANI (@ANI) August 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

