Potato | న్యూఢిల్లీ, ఆగస్టు 11: బంగాళదుంపలు ఆరోగ్యానికి హాని చేస్తాయని చాలామంది భావిస్తారు. అందుకనే వాటికి దూరంగా ఉంటారు. అయితే, ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న వారి ఆహారంలో బంగాళదుంపలు గేమ్ చేంజర్ అవుతాయని, గుండె ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
నిజానికి బంగాళదుంపల్లో పెద్దమొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయని చెప్తుంటారు. అయితే ఇవి పోషకాలకు పవరహౌస్ లాంటివని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని, నడుము చుట్టుకొలతను తగ్గించే శక్తి కూడా వీటికి ఉన్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆలుగడ్డల్లో ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.