Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద.. 18 గేట్లు ఓపెన్
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 1.87 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు.
నల్లగొండ: నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 1.87 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో క్రస్ట్ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు, కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల వదులుతున్నారు.
కాగా, నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలులు ఉన్నాయి.
సాగర్‌లో ఏపీ అధికారుల దౌర్జన్యం..
నాగార్జునసాగర్ డ్యామ్ పైనుంచి క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్రా అధికారులు ధ్వంసం చేశారు. క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి అనువుగా కొన్నేండ్ల క్రితం వాక్‌వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దానికి ఆంధ్రా, తెలంగాణ రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేయగా నిర్వహణ పూర్తిగా తెలంగాణ అధికారులు చేపడుతున్నారు. ఆదివా రం ఆంధ్రాకు సంబంధించిన సుమారు 20 మంది అధికారులు ఏపీ సీఎం పేషీ నుంచి వచ్చారు. వాక్‌వే బ్రిడ్జి గేట్‌కు తాళం వేసి ఉండటంతో తెలంగాణ ఎన్నెస్పీ అధికారులను తాళం చెవి అడిగారు. దాంతో వారు కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆంధ్రా అధికారులు దౌర్జన్యంతో గేట్ తాళం పగులగొట్టి వాక్‌వే బ్రిడ్జి మీదికి వెళ్లిపోయారు.
13వ గేట్ వరకు తమ ఆధీనంలో ఉన్నదం టూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. డ్యా మ్పై కంట్రోల్ రూమ్ 26వ గేట్ అవతల ఉన్నదని అక్కడికి వెళ్లి డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఉన్నతాధికారులకు పంపించినట్టు సమాచారం. ఈ ఘటనపై ఈఈ మల్లికార్జునరావును వివరణ కోరగా ఆంధ్రా అధికారులు తాళం పగులగొట్టిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నా రు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్య లు తీసుకుంటామని తెలిపారు. డ్యామ్‌పై పహారా కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా అనుమతిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

