ఆదివారం 05 జూలై 2020
National - Jun 26, 2020 , 14:14:42

గౌహతిలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌

గౌహతిలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌

గౌహతి: అసోం రాష్ట్రంలో కరోనా మరింత విజృంభిస్తుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజధాని గౌహతిలో ఆదివారం అర్థరాత్రి నుంచి రెండు వారాల పాటు పూర్తి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు శుక్రవారం తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు పేర్కొంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శుక్రవారం నాటికి అసోంలో కరోనా కేసుల సంఖ్య 6,321కి చేరింది. కరోనా వల్ల ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. 

కాగా వలస కార్మికులు తిరిగి వచ్చిన నాటి నుంచి అసోంలో కరోనా కేసుల తీవ్రత మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా గౌహతి నగరంలో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండటంతో సోమవారం నుంచి రెండు వారాలపాటు పూర్తిగా లాక్‌డౌన్‌ను విధించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ శుక్రవారం తెలిపారు. కేవలం మందుల షాపులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో శనివారం, ఆదివారం రోజుల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని వెల్లడించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. 



logo