కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి నిర్మాతలు. మే 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘కళ్లారా..’ అనే మెలోడీ గీతాన్ని గురువారం విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ‘క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పోలీస్ అధికారిణిగా సత్యభామ అన్వేషణ ఎవరి కోసమన్నది ఉత్కంఠను పంచుతుంది. కాజల్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ప్రకాష్‌రాజ్, ననీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్క్రీన్‌ప్లే, సమర్పణ: శశికిరణ్ తిక్క, దర్శకత్వం: సుమన్ చిక్కాల.