Accident | ఘోర ప్రమాదం.. లోయలోపడిన ట్రక్కు.. 22 మంది మృతి
Accident | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో-చైనా సరిహద్దుల్లో (India-China border) కూలీలతో (labourers) వెళ్తున్న ఓ ట్రక్కు అంజావ్ జిల్లాలో అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది.
Accident | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో-చైనా సరిహద్దుల్లో (India-China border) కూలీలతో (labourers) వెళ్తున్న ఓ ట్రక్కు అంజావ్ జిల్లాలో అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో అనేక మంది మరణించారు.
అంజావ్ డిప్యూటీ కమిషనర్ మిల్లో కోజిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండో-చైనా సరిహద్దు వెంబడి ఉన్న హయూలియాంగ్–చగ్లగామ్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అసోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన దినసరి కూలీలను తీసుకువెళ్తున్న ట్రక్కు మార్గం మధ్యలో అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 22 మంది కూలీలు ఉన్నారు. వారంతా చనిపోయినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 17 మృతదేహాలను వెలికి తీశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
IndiGo | సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. వారికి రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు
PM Modi | త్వరలో ప్రధాని మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

