IndiGo | సంక్షోభం (IndiGo Crisis) వేళ దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కీలక ప్రకటన చేసింది. గతవారం అంతరాయం కారణంగా వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు (impacted passengers) రూ.10 వేలు విలువైన అదనపు ట్రావెల్ వోచర్ల (travel vouchers)ను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వోచర్లు డిసెంబర్ 3, 4, 5 తేదీల మధ్య ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని ఇండిగో స్పష్టం చేసింది. ఈ ట్రావెల్ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ గందరగోళం కారణంగా తమ కస్టమర్లు చాలా మంది విమానాశ్రయాల్లో చాలా గంటల పాటూ చిక్కుకుపోయారని అంగీకరించింది. ఈ సందర్భంగా సంక్షోభంపై ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.
దేశంలో అతిపెద్ద విమానసంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం తొలిసారిగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సేవలు ప్రభావితమయ్యాయి. గత పది రోజులుగా పెద్ద ఎత్తున విమానాలు రద్దుకావడం, రీషెడ్యూల్ అయ్యాయి. ఈ కారణంగా ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విమానయాన మంత్రిత్వశాఖ విమానాల్లో కోతలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Also Read..
India In UN | అఫ్ఘాన్‌పై పాక్ దాడులు యుద్ధ చర్యలే : భారత్
సంక్షోభం తలెత్తే వరకు ఏం చేస్తున్నారు?