న్యూఢిల్లీ: అమెరికా-ఇజ్రాయిల్ దళాలు శనివారం జరిపిన దాడికి ప్రతీకారంగా.. ఇరాన్ తమ క్షిపణుల(Iran Missile)ను ప్రయోగిస్తున్నది. ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాలపై తన ప్రతాంప చూపిస్తున్నది. అయితే ఇరాన్‌కు చెందిన ఓ మిస్సైల్ టార్గెట్ దిశగా వెళ్తున్న సమయంలో సుమారు 10 ఇంటర్సెప్టార్ రాకెట్లు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కానీ ఆ రాకెట్లు దాన్నిఏమీ చేయలేకపోయాయి. ఇంటర్సెప్టార్లను తప్పించుకుని ఇరాన్ వదిలిన క్షిపణి తన టార్గెట్‌ను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది.
బహుశా ఈ వీడియోను జెరుసలాంలో తీసి ఉంటారని భావిస్తున్నారు. ఓ ఇంటిపై కప్పు నుంచి ఈ వీడియోను తీశారు. కానీ వాస్తవానికి ఎక్కడ నుంచి, ఏ టైంలో తీశారు తెలియడం లేదు. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మై గాడ్ అని అరుస్తున్న శబ్ధాలు వినిపించాయి. ఇరాన్ మిస్సైల్ మీదకు వెళ్తున్న ఇంటర్సెప్టార్ రాకెట్లకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ క్షిపణి బహుశా ఇరాన్‌కు చెందిన ఫతాహ్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కావొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఫతాహ్-2 క్షిపణిని ఇరాన్ ఇటీవల అప్డేట్ చేసింది. తాజా సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ ఆ ఆయుధాన్ని వాడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫతాహ్-2 హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ తరహా వెళ్తుంది. బాలిస్టిక్కు భిన్నంగా ఈ క్షిపణి ప్రయాణిస్తుంది.
ఫతాహ్ క్షిపణితో ఇజ్రాయెల్ అంతం అవుతుందని గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొన్న విషయం తెలిసిందే.
💥IRANIAN HYPERSONIC MISSILE EVADES MORE THAN 10 INTERCEPT ROCKETS TO HIT TARGET
the camera man just calmly records like it’s a firework display. 🫤 pic.twitter.com/PfQzcJR3ar
— Radar 𝘸 Archie🚨 (@RadarHits) March 1, 2026