Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ రెండో సింగిల్ ‘రాయ్ రాయ్ రా రా’ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. తొలి పాట ‘చికిరి చికిరి’కి మంచి స్పందన లభించిన నేపథ్యంలో రెండో సాంగ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి ఎలాంటి ప్రోమో విడుదల చేయకపోవడంతో పాట రిలీజ్ టైమ్‌పై కొంత గందరగోళం నెలకొంది. తాజా అప్డేట్ ప్రకారం ‘రాయ్ రాయ్ రా రా’ పాటను ఈరోజు సాయంత్రం 7:02 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ టైమ్‌ను కన్ఫర్మ్ చేస్తూ చరణ్‌కి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్లో చరణ్ మాస్ అవతార్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట మోటివేషనల్ టచ్‌తో కూడిన మాస్ నంబర్‌గా ఉండనుంది. ముఖ్యంగా చరణ్ డాన్స్ మూవ్స్ ఈ సాంగ్‌కు హైలైట్ అవుతాయని టాక్. తన ఎనర్జీ, గ్రేస్‌తో చరణ్ మరోసారి అభిమానులను అలరించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సాంగ్‌పై భారీ చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. చరణ్–జాన్వీ జంటపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఈ సినిమాను బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2026 ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
మొత్తానికి ‘పెద్ది’ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఇక కొన్ని గంటల్లో విడుదల కానున్న ‘రాయ్ రాయ్ రా రా’ పాట చరణ్ కెరీర్లో మరో మాస్ హిట్‌గా నిలుస్తుందా అన్నది చూడాలి. రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా, ఈ చిత్రం మాత్రం మంచి హిట్ అవుతుందనే ఆశతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.