హైదరాబాద్ : లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎక్స్‌లో కేటీఆర్ ఏమన్నారంటే.. ‘హలో రాహుల్‌గాంధీ.. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ఏటీఎం అయిన తెలంగాణకు స్వాగతం’ అంటూ వెల్కమ్ చెప్పారు. ‘మీరిప్పుడు సీఎం దగ్గర రూ.1000 కోట్లు వసూలు చేసుకోవడానికి వచ్చారా..?’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ‘పనిలోపనిగా మీరు 100 రోజుల్లో అమలుచేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 ఇతర వాగ్ధానాల పురోగతిని సమీక్షించడంపై కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి’ అని సూచించారు.
Hello @RahulGandhi
Welcome to AICC’s ATM – Telangana
Have you come down just to collect ₹1,000 Cr promised by your CM
Care enough to review the progress of 6 Guarantees that were to be delivered within 100 days and 420 other promises you had made to the people?
— KTR (@KTRBRS) March 2, 2026