BCCI : భారత పురుషుల జట్టు కోచింగ్ యూనిట్లో రెండు వికెట్లు పడ్డాయి. శ్రీలంక పర్యటనకు ముందే ఇద్దరు సహాయక కోచ్‌ల సేవలకు ఎండ్ కార్డ్ పడింది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఏరికోరి తీసుకున్న రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) వైదొలిగాడు. ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న టి.దిలీప్ (T.Dilip) కాంట్రాక్ట్ కూడా ముగిసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అనంతరం డస్కేట్ సమర్పించిన రాజీనామా లేఖను మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదించింది. అలానే దిలీప్‌ను కూడా సాగనంపింది బీసీసీఐ. దాంతో.. టీమిండియాతో వీరికుకున్న అనుబంధం ముగిసింది.
టీమిండియా సహాయక కోచ్ పదవి నుంచి రియాన్ డస్కేట్ తప్పుకున్నాడు. బీసీసీఐతో రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో పాటు వ్యక్తిగత కారణాలతో అతడు ఇక కొనసాగవద్దనే నిర్ణయానికి రావడమే అందుకు కారణం. ఇదే విషయాన్ని డస్చేట్ ప్రధాన కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐకు అతడు తెలియజేశాడు. బీసీసీఐ కూడా అతడి సేవుల ఇక చాలు అనుకుంది. అలానే.. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కోచ్‌గా ఉన్నప్పటి నుంచి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న టి.దిలీప్‌ను సైతం వదులుకుంది భారత బోర్డు. శ్రీలంక పర్యటనకు ముందే వీరిద్దరూ వైదొలగడం భారత జట్టుకు కొంత ఇబ్బందికరమే.
Ryan ten Doeschate has stepped down as India’s men’s assistant coach following the white-ball tour of England
Cricinfo understands he will return to KKR in a coaching role pic.twitter.com/s2a5cgNdyc
— Cricinfo (@cricinfo) July 28, 2026
నెదర్లాండ్స్ మాజీ ఆటగాడైన డస్చేట్ రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయక కోచ్‌గా చేరాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కోచింగ్ సిబ్బందిలో ఒకటైన అతడిని గౌతం గంభీర్ తన బృందలో చేర్చుకున్నాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లు ఎలా ఉన్నా టీ20ల్లో టీమిండియా గొప్పగా ఆడింది.
స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్ గెలుపొందిన భారత్… ఆపై పసికూన ఐర్లాండ్(Ireland) చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. దాంతో, ఆటగాళ్లపైనే కాదు కోచింగ్ సిబ్బందిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో తొలి వన్డే జరుగుతుండగానే అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్చేట్ రాజీనామా వార్త వెలుగులోకి వచ్చింది.

డస్చేట్ కుటుంబం లండన్‌లో నివసిస్తోంది. అతడికి ముగ్గురు పిల్లలు. ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడం అతడి భార్యకు కష్టంగా మారింది. దాంతో, పిల్లలలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో డస్చేట్ కోచింగ్ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా మ్యాచ్‌ల కోసం.. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో.. ఇకపై లండన్‌లోనే ఉంటూ కోచింగ్ కెరీర్ కొనసాగించాలని అనుకుంటున్నాడు.