KTR | నిన్న హైకోర్టు హైడ్రా అనేది 9 తలల విష సర్పం అని చెప్పింది. ముఖ్యమంత్రి ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుంది.. సిగ్గుండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులతోపాటు పలు ఐటీ సంస్థల అంశాలను కేంద్రమంత్రితో చర్చించారు.
అనంతరం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావుతో కలిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువులో ఉంటది. దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటది. దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్, శాసనమండలి చైర్మన్ గుత్తు సుఖేందర్ రెడ్డి, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగులన్నీ చెరువుల్లో, శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదని కేటీఆర్ అన్నారు.
భూమిని భూహారతిలాగా మింగుతున్నది నీ మంత్రులు కాదా..?
కబ్జాకోరులని ముఖ్యమంత్రి అంటున్నరు. అందరికంటే పెద్ద కబ్జాకోరులే మీ అన్నాదమ్ములు కదా.. అంతరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది.. అందరికంటే ఎక్కువ విధ్వంసం చేస్తున్నది మీ మంత్రులు కదా..? కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రులు కాదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన నాడు రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య సైజ్) ఎంతంటే మొత్తం 16 లక్షల ఎకరాలు.. ఇవాళ అది కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత కోటి ఎకరాలు పెడుతున్నరు. 30 శాతం కమిషన్ తీసుకోవడం లేదా..? మీ మంత్రులు.. అని ప్రశ్నించారు. కబ్జాకోరులు, భూదందాలు చేసేది.. భూమిని భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం, నీ మంత్రులు కాదా..? ప్రజలకు తెల్వదా..? అని అన్నారు.
హైడ్రా పేరుతో నువ్వు సృష్టిస్తున్న అరాచకం కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్‌లో కూలగొట్టి ఒక ఇటుక పెట్టకుండా.. ఇల్లు కట్టకుండా విధ్వంసం సృష్టించి రియల్ ఎస్టేట్‌ను సృష్టించి నువ్వు డబ్బులు సొమ్ము చేసుకుంటున్నవ్. పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు, బిల్డింగులు కడుతుంటే నీకు కనబడదు. కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నవ్. అందుకే మేమనేది హైడ్రా అనేది బ్లాక్‌మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తామన్నారు.
రేవంత్ రెడ్డికి వేట కుక్కలా హైడ్రా..
హైడ్రా రేవంత్ రెడ్డికి వేట కుక్కలా మారిందని కేటీఆర్ ఆరోపించారు. ఒక అధికారి 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చరిత్రలో ఎక్కడైనా ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్ల దగ్గర RR టాక్స్ వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా..? అన్నారు. నిజంగానే హైడ్రా మంచి పనులు చేస్తుంటే, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు, కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌసులు ఎందుకు కూలగొట్టడం లేదు..? చెప్పాలని డిమాండ్ చేశారు.
మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే హైడ్రాని ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తాము
హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని నిన్న హైకోర్టు చెప్పింది
ఇంతకంటే చెంపపెట్టు ఒక ముఖ్యమంత్రికి ఏం ఉంటది
బడా బాబులను మాత్రం వదిలిపెట్టి.. గరీబోళ్ల మీద హైడ్రా పడుతుంది
మంత్రి పొంగులేటి ఇల్లు చెరువులో ఉంటే… https://t.co/h2s07fC70Y pic.twitter.com/QidScV5w5M
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026