Building Collapses | మహారాష్ట్ర (Maharashtra)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్ (Virar) ప్రాంతంలో గల ఓ భవనం కుప్పకూలిపోయింది (Building Collapses). ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు (Building Collapse). శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు.
బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనాన్ని అనధికారికంగా (illegal building) నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ భవనం కూలడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారందరినీ చందన్సార్ సమాజమందిర్కు తరలించినట్లు జిల్లా కలెక్టర్ ఇందూ రాణి జఖర్ తెలిపారు. నిరాశ్రయులకు ఆహారం, నీరు, వైద్య సహాయం అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో భవనం యజమాని నితల్ గోపీనాథ్ సానేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read..
Bomb Threat | 20 కళాశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
US-India | ఇది మోదీ యుద్ధం.. భారత్ అలా చేస్తే రేపటి నుంచే 25 శాతం సుంకాలు : అమెరికా
Trump Tariffs | భారత్‌పై 50 శాతం సుంకాలు.. ఆ యూనివర్సిటీలో అమెరికా బ్రాండ్ల పానీయాలపై నిషేధం