Bomb Threat | దేశరాజధాని ఢిల్లీలోని పలు విద్యాసంస్థలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు పాఠశాలలకు, కళాశాలలకు వరుసగా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాదాపు 20 కళాశాలలకు (Delhi colleges) బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఈ మెయిల్స్ ద్వారా ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని చాణక్యపురి (Chanakyapuri)లోగల జీసస్ అండ్ మేరీ కాలేజ్ (Jesus and Mary College) సహా దాదాపు 20 కళాశాలలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్స్‌తో అప్రమత్తమైన ఆయా కళాశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీ పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన కళాశాలల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో కళాశాలల ప్రాంగణంలో క్షుణ్ణంగా సోదాలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవన్నీ నకిలీ బెదిరింపులుగా తేల్చారు. ఈ మేరకు మెయిల్స్ పంపిన వారిని పట్టుకునేందుకు విచారణ చేపడుతున్నారు.
Also Read..
US-India | ఇది మోదీ యుద్ధం.. భారత్ అలా చేస్తే రేపటి నుంచే 25 శాతం సుంకాలు : అమెరికా
School Shooting | స్కూల్లో ప్రార్ధన చేస్తుండగా కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి.. నిందితుడు కూడా..