Democrats| రష్యా చమురు కొనుగోలు (Russian Oil) కారణం చూపి న్యూఢిల్లీపై అమెరికా భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. యూఎస్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, మిత్ర దేశం అంటూనే భారత్ విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ప్రదర్శిస్తున్న తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌పై అమెరికా అధిక సుంకాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా ట్రంప్ తీరుపై అమెరికన్లు సైతం మండిపడుతున్నారు. తాజాగా న్యూఢిల్లీపై ట్రంప్ విధించిన సుంకాలను యూఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలోని డెమోక్రాట్లు (Democrats) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ట్రంప్‌పై ఫైర్ అయ్యారు.
‘రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టారిఫ్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. ట్రంప్ చర్య కేవలం భారత ప్రజలనే కాదు.. అమెరికన్లకు కూడా బాధిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా బలోపేతమైన యూఎస్-భారత్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై అధిక సుంకాలు అని చెబుతున్నప్పటికీ.. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
Also Read..
US-India | ఇది మోదీ యుద్ధం.. భారత్ అలా చేస్తే రేపటి నుంచే 25 శాతం సుంకాలు : అమెరికా
Trump Tariffs | భారత్‌పై 50 శాతం సుంకాలు.. ఆ యూనివర్సిటీలో అమెరికా బ్రాండ్ల పానీయాలపై నిషేధం
Donald Trump | మోదీకి ఫోన్‌చేసి యుద్ధం నేనే ఆపా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట మళ్లీ పాత పాట