Trump Tariffs | భారత్‌పై 50 శాతం సుంకాలు.. ఆ యూనివర్సిటీలో అమెరికా బ్రాండ్ల పానీయాలపై నిషేధం
రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా కేవలం భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు (Trump Tariffs) విధించారు. పెరిగన టారీఫ్‌లు బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి వచ్చాయి.
న్యూఢి: రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా కేవలం భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు (Trump Tariffs) విధించారు. పెరిగన టారీఫ్‌లు బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి వచ్చాయి. దీనికి నిరసగా పంజాబ్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ అమెరికా ఉత్పత్తులపై నిషేధం విధించింది. తమ క్యాంపస్‌లో అమెరికన్ బ్యాండ్ల శీతల పానీయాలను ఇకపై అమ్మేది లేదని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అహకారానికి వ్యతిరేకంగా చేపట్టిన స్వదేశీ 2.O ఉద్యమంలో దేశం మొత్తం భాగస్వామ్యం కావాలని పిలుపునచ్చింది.
అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకాలకు నిరసగా పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి బ్రాండ్లు ఉత్పత్తులు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ మేరకు వర్సిటీ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ (Ashok Kumar Mittal) వెల్లడించారు. భారతీయ ఉత్పత్తులపై సుంకాలను ఆర్థిక దౌర్జన్యంగా అభివర్ణించిన మిట్టల్.. భారతదేశం ఎవరి ముందూ తలవందని చెప్పారు. ఇది స్వదేశం 2.0 ఉద్యమమని చెప్పారు. భారతీయ మార్కెట్ నుంచి అమెరికా కంపెనీలు ఏడాదికి రూ.6.5 లక్షల కోట్లకుపైగా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఒకవైపు లాభాలు ఆర్జిస్తూ, మరోవైపు ఆంక్షలు విధిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇప్పటికీ ఆపని అమెరికా, దాని యూరోపియన్ భాగస్వామ్య దేశాలు.. కేవలం భారత్‌నే లక్ష్యంగా చేసుకున్నాయని మండిపడ్డారు. దీని నిరసగా 40 వేలమంది విద్యార్థులతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ వర్సిటీల్లో ఒకటైన తమ ఎల్పీయూ క్యాంపస్‌లలో ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. కాగా, ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 (#Swadeshi2.0 ) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- America
- Ashok Kumar Mittal
- ban
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

