Floods | భారీ వర్షాలు, వరదలకు (Floods) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.గంగా, శారదా, ఘఘ్రా సహా తదితర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి (rivers flow above danger mark). దీంతో నదీ పరివాహ ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతోంది. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా తెలిపారు.
మీరట్‌లోని జాకీర్ కాలనీలో భవనం కూలిన ఘటనలో 10 మంది వరకూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక గోండాలో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. షాజహాన్‌పూర్‌లోని నది నుండి మేకను రక్షించే ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. మరో నలుగురు పిల్లల్ని కాపాడినట్లు షాజహాన్ పూర్ ఎస్పీ తెలిపారు. మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
Also Read..
Actor Darshan | గతంలో దర్శన్ ఉన్న బెంగళూరు జైల్లో ఫోన్లు, కత్తులు, సిగరెట్లు లభ్యం..!
Baramulla | బారాముల్లా ఎన్కౌంటర్.. పారిపోతున్న టెర్రరిస్ట్పై సైన్యం తూటాల వర్షం.. డ్రోన్ ఫుటేజ్
Mamata Banerjee | వైద్యులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన బెంగాల్ ప్రభుత్వం