Actor Darshan | అభిమాని రేణుక స్వామి (Renukaswamy) హత్య కేసులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప (Actor Darshan)కు వీఐపీ ట్రీట్మెంట్ (VIP treatment) ఇచ్చిన బెంగళూరు జైలులో పోలీసులు తాజాగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా ఫోన్లు, కత్తులు, సిగరెట్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
ఈ కేసులో దర్శన్ మొన్నటి వరకూ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు (Parappana Agrahara Prison)లో శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. విచారణ ఖైదీగా ఉన్న నటుడికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇటీవలే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. జైలులోని రౌడీషీటర్లతో జల్సాగా టీ తాగుతూ, సిగరెట్ కాల్చుతూ ఆనందంగా గడుపుతున్నట్లు ఓ ఫొటో బయటపడింది. ఈ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో అధికారులు అతడిని బళ్లారి జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు జైల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 15 మొబైల్ ఫోన్స్, రూ.1.3 లక్షల విలువైన సామ్సంగ్ డివైజ్, మూడు మొబైల్ ఫోన్ ఛార్జర్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, 7 ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఐదు కత్తులు, రూ.36 వేల నగదు, సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టెలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అందులో పవర్ కంట్రోల్ రూమ్ నుంచి రెండు ఎలక్ట్రిక్ స్టవ్‌లు, రూ.11,800 నగదు, రెండు కత్తులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాత్రూమ్ పైపుల్లో ప్లాస్టిక్ కవర్లలో దాచి ఉంచిన 11 మొబైల్ ఫోన్లు, మూడు మొబైల్ ఛార్జర్లు, రెండు ఇయర్ బర్డ్స్, ఐదు ఎలక్ట్రిక్ స్టవ్‌లు, రూ.24,300 నగదు, మూడు కత్తులు, పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
Manu Bhaker | నీరజ్ చోప్రాకు గాయం.. మను బాకర్ రియాక్షన్ ఇదే..
Baramulla | బారాముల్లా ఎన్కౌంటర్.. పారిపోతున్న టెర్రరిస్ట్పై సైన్యం తూటాల వర్షం.. డ్రోన్ ఫుటేజ్
Mamata Banerjee | వైద్యులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన బెంగాల్ ప్రభుత్వం