Manu Bhaker | భారత ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా (Neeraj Chopra)కు గాయమైన విషయం తెలిసిందే. చాలాకాలంగా గజ్జల్లో గాయం వేధిస్తున్నా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ స్టార్ జావెలిన్ త్రోయర్.. తాజాగా ఆ గాయానికి తోడు ఎడమ చేతి ఎముక విరిగినా డైమండ్ లీగ్ ఫైనల్స్ బరిలో నిలిచి రెండో స్థానంలో నిలిచాడు. తుదిపోరులో ఒకే ఒక్క సెంటిమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయినా.. ఏడాది పాటు నిలకడగా రాణించి 2024 సీజన్‌ను విజయవంతంగా ముగించాడు.
ఈ ఫైనల్‌కు తాను చేతి గాయంతోనే బరిలోకి దిగినట్లు పోటీ అనంతరం నీరజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ మేరకు చేతి ఎక్స్ రే ఫొటోను షేర్ చేశాడు. ఈ ఏడాదిలో ఇదే చివరి పోటీ అని.. పూర్తి ఫిట్నెస్తో తిరిగి కొత్త సీజన్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. 2025లో కలుద్దాం అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను బాకర్ (Manu Bhaker) స్పందించింది. నీరజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ‘2024ను అద్భుతంగా ముగించిన ఛాంపియన్ నీరజ్ చోప్రాకు అభినందనలు. గాయం నుంచి నువ్వు త్వరగా కోలుకొని.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నా’ అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Congratulations @Neeraj_chopra1 on a fantastic season in 2024. Wishing you a speedy recovery and more success in the coming years.#NeerajChopra https://t.co/4NUgfVtiAf
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) September 15, 2024
నీరజ్ చోప్రా వరుసగా రెండో ఏడాదీ డైమండ్ లీగ్ (డీఎల్) ఫైనల్స్‌లో రెండో స్థానంతో మెరిశాడు. డీఎల్ టైటిల్ పోరులో అతడు ఒకే ఒక్క సెంటిమీటర్ తేడాతో టైటిల్ కోల్పోవడం విచారకరం. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్.. బరిసెను 87.86 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కొద్దిరోజుల క్రితమే పారిస్ వేదికగా ముగిసిన ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్.. డీఎల్ ఫైనల్స్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ఇక పారిస్‌లో కాంస్య పతకం గెలిచిన గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరంతో అగ్రస్థానాన నిలిచి టైటిల్ దక్కించుకోగా జర్మనీ ఆటగాడు జులియన్ వెబర్ 85.97 మీటర్ల త్రో తో మూడో స్థానంలో నిలిచాడు.
తాజా ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు ప్రైజ్ మనీ కింద 12వేల యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 10.06 లక్షలు) దక్కగా పీటర్స్‌కు డైమండ్ లీగ్ ట్రోఫీతో పాటు 30 వేల యూఎస్ డాలర్లు (రూ. 25.16 లక్షలు) దక్కాయి. ఏడాదంతా నిలకడగా రాణించిన నీరజ్‌కు డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో రెండో స్థానాన నిలవడం ఇది వరుసగా రెండోసారి. 2023లోనూ అతడు సెకండ్ ప్లేస్‌కే పరిమితమయ్యాడు. 2022లో మాత్రం టైటిల్ నెగ్గాడు.
As the 2024 season ends, I look back on everything I’ve learned through the year – about improvement, setbacks, mentality and more.
On Monday, I injured myself in practice and x-rays showed that I had fractured the fourth metacarpal in my left hand. It was another painful… pic.twitter.com/H8nRkUkaNM
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 15, 2024
Also Read..
Chiranjeevi | సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేసిన చిరంజీవి
Baramulla | బారాముల్లా ఎన్కౌంటర్.. పారిపోతున్న టెర్రరిస్ట్పై సైన్యం తూటాల వర్షం.. డ్రోన్ ఫుటేజ్
Mamata Banerjee | వైద్యులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన బెంగాల్ ప్రభుత్వం