Baramulla | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ బారాముల్లా (Baramulla)లో ఎన్కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ (drone footage) తాజాగా బయటకు వచ్చింది. బారాముల్లాలోని ఓ ఇంట్లో టెర్రరిస్ట్ నక్కి ఉన్నట్లు సమాచారం అందుకున్న సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టి.. బుల్లెట్ల వర్షం కురిపించింది.
దీంతో అందులో దాక్కున్న టెర్రరిస్ట్ (Terrorist) రైఫిల్ పట్టుకుని కాల్పులు జరుపుతూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ ఓ చోట కిందపడిపోయాడు. ఆ తర్వాత లేచి పక్కనే పొదల్లో గోడచాటునకు వెళ్లి దాక్కున్నాడు. సైన్యం ఆ గోడపై బుల్లెట్ల వర్షం కురిపించింది. అక్కడి నుంచి తెల్లని పొగ బయటకు రావడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Process of “Hoorification” by Indian Army..
Unseen footage of Baramulla, Chak Tapar operation..
Pakistan is trying very hard to disrupt the festival of democracy for people of J&K..#Baramulla #ChakTapar#IndianArmy #electioncountdown pic.twitter.com/blYOOCNu8y— Shams (@shams_gazelle) September 16, 2024
కాగా, ప్రధాని మోదీ పర్యటన వేళ జమ్ము కశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బారాముల్లా, కిష్ట్వర్ జిల్లాల్లో మూడు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. నాలుగు రోజుల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్లు తీవ్ర కలకలం రేపాయి.
శుక్రవారం బారాముల్లాలో భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీస్ సంయుక్త సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. శనివారం ఉదయం పట్టాన్ ప్రాంతం చాక్ టాపెర్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శుక్రవారం కథువాలో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ‘ఎక్స్’లో తెలిపారు. ఎన్నికల ప్రచార నిమిత్తం దోడా జిల్లాలో శనివారం మెగా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. భారత ప్రధాని దోడా జిల్లాలో పర్యటించటం 42 ఏండ్లలో ఇదే తొలిసారి.
దాదాపు పదేండ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొలివిడతలో భాగంగా సెప్టెంబర్ 18న 24 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Also Read..
Mamata Banerjee | వైద్యులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన బెంగాల్ ప్రభుత్వం
Vande Metro | నేటి నుంచి వందే మెట్రో పరుగులు.. నమో భారత్‌గా పేరు మార్పు
Delhi CM | కేజ్రీవాల్‌తో సిసోడియా భేటీ.. తదుపురి సీఎం ఎవరన్నదానిపై చర్చలు.. రేసులో ఉన్నది వీళ్లే..