Vande Metro | కేంద్రంలోని మోదీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (Vande bharat express) దేశంలోని ప్రధాన నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్రం వందే మెట్రో (Vande Metro) రైలును అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ ప్రారంభించనున్నారు. గుజరాత్లో ఈ రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్ మెట్రో రైలు పేరు మారింది. ఇకపై ఈ రైలును ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’ (Namo Bharat Rapid Rail)గా పిలువనున్నారు.
ఈ తొలి వందే మెట్రో సర్వీసు గుజరాత్‌లోని అహ్మదాబాద్- భుజ్ నగరాల మధ్య ఇవాళ మోదీ ప్రారంభించనున్నారు. ఈ వందే మెట్రో పూర్తిగా అన్రిజర్వ్డ్ ఎయిర్ కండీషన్ రైలు. మొత్తం 12 కోచ్‌లు ఉండే ఈ రైలులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే పీఆర్ఓ ప్రదీప్ శర్మ వెల్లడించారు. అహ్మదాబాద్- భుజ్ మధ్య నడిచే ఈ రైలు 9 స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. 360 కిలోమీటర్ల దూరాన్ని 5:45 గంటల్లోనే చేరుకుంటుందని ఆయన చెప్పారు. గరిష్ఠంగా గంటకు110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు.
ఈ వందే భారత్ మెట్రో రైళ్లలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్‌గా ఉండనున్నాయి. ఒక రైల్లో కనీసం 12 బోగీలు ఉంటాయి. అయితే, ఆయా మార్గాల్లో రద్దీ ఆధారంగా వీటిని 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ రైలు కోచ్‌లను పంజాబ్ (Punjab)లోని కపుర్తలా (Kapurthala)లోని ఒక రైలు కోచ్ ఫ్యాక్టరీ నిర్మించింది. మొదట్లో 50 రైళ్లను నిర్మిస్తామని, క్రమంగా వాటి సంఖ్యను 400కి పెంచనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
Also Read..
Delhi CM | కేజ్రీవాల్‌తో సిసోడియా భేటీ.. తదుపురి సీఎం ఎవరన్నదానిపై చర్చలు.. రేసులో ఉన్నది వీళ్లే..
Killer wolfs | 13 ఏళ్ల బాలుడిపై తోడేలు దాడి
Elon Musk | ట్రంప్‌పైనే ఎందుకు..? వాళ్లపై హత్యాయత్నాలు చేయలేదేం..? : ఎలాన్ మస్క్