Elon Musk | ట్రంప్‌పైనే ఎందుకు..? వాళ్లపై హత్యాయత్నాలు చేయలేదేం..? : ఎలాన్ మస్క్
Elon Musk | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై హత్యాయత్నం ఘటనపై బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ఈ మేరకు డెమోక్రాటిక్ పార్టీ నేతలపై సందేహం వ్యక్తం చేశారు.
Elon Musk | అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. అయితే కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని ఆయన ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనపై బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ఈ మేరకు డెమోక్రాటిక్ పార్టీ నేతలపై సందేహం వ్యక్తం చేశారు.
మాజీ అధ్యక్షుడిపైనే ఎందుకు మర్డర్ అటెంప్ట్ జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘వారు డొనాల్డ్ ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు..?’ అని ఎక్స్ వినియోగదారు అడిగిన ప్రశ్నకు మస్క్ సమాధానమిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్న ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం మస్క్ ట్వీట్ వైరల్‌గా మారింది. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌ను మస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు.
And no one is even trying to assassinate Biden/Kamala 🤔 https://t.co/ANQJj4hNgW
— Elon Musk (@elonmusk) September 16, 2024
కాగా, ఫోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని, ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవని ఆయన ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ట్రంప్ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా ధ్రువీకరించింది. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
రెండు నెలల క్రితమే..
ట్రంప్ పై రెండు నెలల క్రితమే హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం డయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఆ తర్వాత ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం (security threat) బయటపడింది.
గత నెల 30న పెన్సిల్వేనియా (Pennsylvania)లోని జాన్స్టౌన్ (Johnstown)లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Donald Trump | డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
Delhi CM | కేజ్రీవాల్‌తో సిసోడియా భేటీ.. తదుపురి సీఎం ఎవరన్నదానిపై చర్చలు.. రేసులో ఉన్నది వీళ్లే..
Killer wolfs | 13 ఏళ్ల బాలుడిపై తోడేలు దాడి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

