Diarrhoea | అస్సోం (Assam) రాష్ట్రంలో అతిసార వ్యాధి (Diarrhoea) తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్ (Tea Estate)లో డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కేవలం వారం వ్యవధిలోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో అపరిశుభ్రత, సరైన తాగునీరు లేకపోవడంతో అతిసార వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
వారం వ్యవధిలోనే టీ ఎస్టేట్‌లో 11 మంది కార్మికులు అతిసార వ్యాధి కారణంగా మరణించడంపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు అస్సోం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) వ్యాధి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని అంచనా వేయాలని అస్సోంప్రధాన కార్యదర్శి, టిన్సుకియా జిల్లా కమిషనర్‌ను ఆదేశించారు. వ్యాప్తి కారణంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సాయం అందించాలన్నారు. మరోవైపు అస్సోం ఎమ్మెల్యే రూపేష్ గోవాలా కూడా టీ ఎస్టేట్‌ను సందర్శించి పరిస్థితిన సమీక్షించారు. వ్యాధి నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read..
Food Poisoning | జాతరలో ప్రసాదం తిని.. 50 మందికి అస్వస్థత
Gold Seized | ముంబై విమానాశ్రయంలో 11 కిలోల బంగారం స్వాధీనం
Mexico | మెక్సికో అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ర్యాలీలో కూలిన వేదిక.. ఐదుగురు మృతి