Mexico | మెక్సికో (Mexico)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. బలమైన గాలుల కారణంగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది (Stage Collapses). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
జూన్ 2న మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. బుధవారం రాత్రి ఉత్తర మెక్సికో రాష్ట్రమైన న్యూవో లియోన్‌లో అధ్యక్ష అభ్యర్థి (Presidential Candidates Rally) జార్జ్ అల్వారెజ్ మేనెజ్ (Jorge Alvarez Maynez) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ప్రసంగిస్తుండగా.. బలమైన గాలులు వీచాయి. ఈ గాలులకు ప్రచారం కోసం వేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన స్టేజ్‌పై ఉన్న కొందరు ప్రాణాలను కాపాడుకునేందుకు వేదికపై నుంచి కిందకు దూకేశారు. అయితే, ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
‘దురదృష్టవశాత్తు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయాలపాలయ్యారు’ అని ఉత్తర రాష్ట్రమైన న్యూవో లియోన్ గవర్నర్ శామ్యూల్ గార్సియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదం నుంచి తాను క్షేమంగా బయటపడినట్లు అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
“San Pedro Garza García”:
Porque se desplomó el escenario donde se llevaba a cabo el evento de campaña de Lorenia Canavati, candidata a la alcaldía de San Pedro Garza García, Nuevo León, donde se encontraba Jorge Álvarez Máynez. pic.twitter.com/czzAP0ZmdV— ¿Por qué es Tendencia? (@porktendencia) May 23, 2024
Also Read..
Nikki Haley | అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ట్రంప్‌కే.. స్పష్టం చేసిన నిక్కీ హేలీ
Rishi Sunak | జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు
Arvind Kejriwal | స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు