Nikki Haley | అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ట్రంప్‌కే.. స్పష్టం చేసిన నిక్కీ హేలీ
Nikki Haley | రిపబ్లికన్ పార్టీ (Republican Party) కీలక నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (Nikki Haley) కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential poll) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే తన మద్దతు అని ప్రకటించారు.
Nikki Haley | రిపబ్లికన్ పార్టీ (Republican Party) కీలక నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (Nikki Haley) కీలక ప్రకటన చేశారు. మొన్నటి వరకూ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు గట్టి పోటీనిచ్చిన హేలీ.. ఇప్పుడు ఆయనకే జై కొట్టారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential poll) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే తన మద్దతు అని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు ట్రంప్‌కే అని స్పష్టం చేశారు.
వాషింగ్టన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేలీ ఈ ప్రకటన చేశారు. ‘విధానాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపూర్ణంగా కనిపించడంలేదు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను. ట్రంప్ విధానాలు సంపూర్ణంగా లేకపోయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఓ విపత్తు. కాబట్టి నేను ట్రంప్‌కే మద్దతిస్తా. నా ఓటు ఆయనకే’ అని హేలీ స్పష్టం చేశారు.
కాగా, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్‌కు నిక్కీ హేలీ గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని నెలలపాటు ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇద్దరూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. దీంతో ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ రెండుగా చీలిపోతుందని అంతా ఊహించారు. అయితే, అనూహ్యంగా రెండు నెలల క్రితం అధ్యక్ష రేసునుంచి తప్పుకుంటున్నట్లు హేలీ ప్రకటించారు. ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయంపై గత కొంతకాలంగా మౌనంగా ఉన్న హేలీ.. ఎట్టకేలకు ట్రంప్‌కే జై కొట్టారు.
Also Read..
Rishi Sunak | జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు
Head transplant | ఒకరి తల మరొకరికి.. ‘హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్’ సాధ్యమేనంటున్న అమెరికా స్టార్టప్
Nightmares | నిద్రలో తరచూ పీడ కలలు వస్తున్నాయా.. ఇది లూపస్ లాంటి వ్యాధికి సూచన కావచ్చట..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

