Head transplant | ఒకరి తల మరొకరికి.. ‘హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్’ సాధ్యమేనంటున్న అమెరికా స్టార్టప్
Head transplant | 2008లో వచ్చిన హాలీవుడ్ సైన్స్‌ఫిక్షన్ సినిమా ‘ఎక్స్ ఫైల్ ఐ వాంట్ టూ బిలీవ్' చూశారా? ఈ మూవీలో ఒక వ్యక్తి తలను మరో వ్యక్తికి (హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్) అమరుస్తారు. అయితే, ఈ సినిమాలో జరిగినట్టు నిజజీవితంలో ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడం సాధ్యమా?
- రోబోలతో కూడిన వీడియో విడుదల.. నెట్టింట్లో వైరల్
- దేవుడిని అధిగమించలేరంటూ నెటిజెన్ల కామెంట్లు
- ఇప్పటికే జంతువులపై ‘హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్’ ప్రయోగాలు
- ప్రతి ఒక్కటీ ఫెయిల్.. సున్నితమైన నాడీవ్యవస్థే సమస్య
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): 2008లో వచ్చిన హాలీవుడ్ సైన్స్‌ఫిక్షన్ సినిమా ‘ఎక్స్ ఫైల్ ఐ వాంట్ టూ బిలీవ్’ చూశారా? ఈ మూవీలో ఒక వ్యక్తి తలను మరో వ్యక్తికి (హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్) అమరుస్తారు. అయితే, ఈ సినిమాలో జరిగినట్టు నిజజీవితంలో ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడం సాధ్యమా? అంటే.. అవునంటున్నది అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘బ్రెయిన్‌బ్రిడ్జ్’. ‘హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్’ ఎలా చేయవచ్చో.. రోబోలతో చిత్రీకరించిన వీడియోనూ సోషల్‌మీడియాలో విడుదల చేసింది.
ఏమిటీ ‘హెడ్ ట్రాన్స్‌ప్లాంట్’?
ప్రమాదాల్లో అవయవాలు కోల్పోవడం, లేదా దెబ్బ తినడం జరిగితే దాతల నుంచి సేకరించిన అవయవాలను తీసుకొని ‘ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్’ చేసినట్టే ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడాన్ని ‘హెడ్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటారు.
వీడియోలో ఏముంది?
‘బ్రెయిన్ బ్రిడ్జ్’ విడుదల చేసిన వీడియోలో రెండు రోబోలు .. ఒక రోబో తలను మరో రోబోకు ఎలా అమర్చవచ్చో చూపించారు. స్టేజీ-4 క్యాన్సర్, పక్షవాతం, బ్రెయిన్ డెడ్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులతో సతమతమయ్యేవారి తలను తొలగించి, అప్పుడే మరణించిన వారి తలను పెట్టవచ్చని ‘బ్రెయిన్ బ్రిడ్జ్’ వీడియోలో పేర్కొంది.
నిజంగానే సాధ్యమా?
‘హెడ్ ట్రాన్స్‌ప్లాంట్’ ప్రయోగం కొత్తదేం కాదు. ఈ తరహా ప్రయోగాలు 1900లోనే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు జంతువులపై ఈ ప్రయోగాలు చేశారు. 1954లో సోవియెట్ యూనియన్‌కు చెందిన ఓ సర్జన్ ఓ కుక్కకు ‘హెడ్ ట్రాన్స్‌ప్లాంట్’ చేశాడు. అయితే, సున్నితంగా ఉండే నాడీవ్యవస్థ, రక్తనాళాలు పనిచేయకపోవడంతో ఆ కుక్క కొన్ని రోజులకే మరణించింది. అందుకే, ‘బ్రెయిన్‌బ్రిడ్జ్’ వీడియోపై నెటింట్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

