Rishi Sunak | జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు
Rishi Sunak | బ్రిటన్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (UK general election) అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative party)కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) కీలక ప్రకటన చేశారు.
Rishi Sunak | బ్రిటన్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (UK general election) అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative party)కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు. జూలై 4న దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా త్వరలోనే పార్లమెంట్‌ను కూడా రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద వర్షంలో తడుస్తూనే ఆయన ఈ ప్రకటన చేశారు. ‘బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. దేశాధినేత కింగ్ చార్లెస్ IIIతో మాట్లాడాను. పార్లమెంట్‌ను రద్దు చేయమని అభ్యర్థించాను. ఇందుకు రాజు కూడా అనుమతించారు. జూలై 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి’ అని రిషి సునాక్ వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Also Read..
Head transplant | ఒకరి తల మరొకరికి.. ‘హెడ్‌ట్రాన్స్‌ప్లాంట్’ సాధ్యమేనంటున్న అమెరికా స్టార్టప్
Nightmares | నిద్రలో తరచూ పీడ కలలు వస్తున్నాయా.. ఇది లూపస్ లాంటి వ్యాధికి సూచన కావచ్చట..!
స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నాం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

