e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు దవాఖానలో మెరుగైన వైద్యం : కలెక్టర్‌

దవాఖానలో మెరుగైన వైద్యం : కలెక్టర్‌

దవాఖానలో మెరుగైన వైద్యం : కలెక్టర్‌

నారాయణపేట టౌన్‌, మే 15: పట్టణంలోని జిల్లా ద వాఖానలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటు లో ఉన్నాయని కలెక్టర్‌ హరిచందన అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓపీ మి శ్రా రూ. 5లక్షల విలువ చేసే 5 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌లను పేట జిల్లా దవాఖానకు ఉచితంగా ఇవ్వగా వాటిని కలెక్టర్‌ తరఫున ఆర్డీవో వెంకటేశ్వర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పా ల్గొని మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితులలో జిల్లా ప్రజలకు తమ వంతుగా సహాయం అందించేందుకు ముం దుకు వచ్చిన ఎస్‌బీఐ ప్రతినిధులను ఆమె అభినందించా రు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌తో ప్రభుత్వ దవాఖాన మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
కరోనా బాధితులు అనవసరంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సాధ్యమైనంత వరకు హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉం టూ వైద్యులు అందజేసిన మందులు వాడితే వ్యాధి నయమవుతుందన్నా రు. ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిన సందర్భంలో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం పొందవచ్చన్నారు. వ్యాధిగ్రస్తులు అనవసరంగా భయాందోళనకు గురికావడం వలన రోగనిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధి తీవ్రమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. జిల్లా దవాఖానలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి రావడం వల్ల వ్యాధిగ్రస్తులు మెరుగైన సదుపాయాలు పొం దవచ్చని పేర్కొన్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రసన్నకుమార్‌, ఎస్‌బీఐ మేనేజర్‌ శ్రీనివాస బు చ్చిబాబు తదితరులు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందుకున్న వారిలో ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దవాఖానలో మెరుగైన వైద్యం : కలెక్టర్‌

ట్రెండింగ్‌

Advertisement