శనివారం 06 మార్చి 2021
Narayanpet - Dec 30, 2020 , 00:40:54

జోరుగా ‘హుక్కా’ అమ్మకం

జోరుగా ‘హుక్కా’ అమ్మకం

కోస్గి : పట్టణంలో హుక్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పలు దుకాణాల్లో అమ్మకాలు యథేచ్ఛగా కొసాగుతున్నాయి. రాత్రి వేళల్లో యు వకులంతా ఓ దగ్గర గుమిగూడి హుక్కా గుంజు తూ మత్తుగా ఊగుతూ చిందులేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో యువకులు ఈ చెడు అల వాట్లకు బానిసలయ్యారు. ఈ విషయం తెలిసి కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం రాత్రి కొం త మంది యువకులు దర్జాగా పట్టణంలోని ఓ దు కాణం వద్ద కూర్చొని హుక్కా పీలుస్తూ మత్తుకు అలవాటుపడ్డారు. ఇదేమిటంటే ఇదే మేము ని త్యం పీలుస్తామంటున్నారు. వారి ఆరోగ్యాలపై వా రికి ధ్యాస కూడా లేకుండాపోయింది. న్యూ ఇయ ర్‌ దగ్గరపడుతున్నదని, ఈ వేడుకులకు మరింతగా తీసుకురావాలంటూ వారిలో వారే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ హుక్కా అమ్మకం దారులపై చర్య లు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలకు ఇలాంటి అమ్మకాలు లే కుండా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.

VIDEOS

logo