చెదిరిన గూడు

- గృహప్రవేశానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
మరికల్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి(56) హైదరాబాద్‌లో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
వీరి కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి (24) మూడేండ్ల కిందట, కూతురు మౌనికరెడ్డి (34) ఐదేండ్ల కిందట అమెరికాకు వెళ్లి టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. రెండు నెలల కిందట భార్య లక్ష్మి(50)తో కలిసి నర్సింహారెడ్డి అమెరికాకు వెళ్లాడు. మూడు నెలల పాటు అక్కడే ఉండి జనవరిలో ఇండియాకు వచ్చేలా అక్కడికి వెళ్లారు. గత నెల 29న టెక్సాస్‌లో కొడుకు, కూతురు కొనుగోలు చేసిన నూతన గృహ ప్రవేశం జరిగింది. శనివారం వారంతపు సెలవులు ఉండటంతో కుటుంబసభ్యులతోపాటు భరత్ స్నేహితుడు సాయిప్రణీత్‌రెడ్డి, మరొకరితో కలిసి మొత్తం ఆరుగురు కారులో సాయి ప్రణీత్‌రెడ్డి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో నర్సింహారెడ్డి, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మౌనికరెడ్డి, సాయిప్రణీత్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న మరొకరి పరిస్థితి తెలియాల్సి ఉన్నది. ఈ సంఘటనతో పెద్దచింతకుంట, లక్ష్మి తల్లిగారి ఊరు అజిలాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహారెడ్డికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఈ ఘటనతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
మృతదేహాలను తీసుకురావాలి
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నర్సింహారెడ్డి, లక్ష్మి, భరత్‌కుమార్‌రెడ్డి మృతదేహాలను స్వగ్రామం పెద్దచింతకుంటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని నర్సింహారెడ్డి తమ్ముడు శశిభూషణ్ కోరాడు. ఇందుకు అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
తాజావార్తలు
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్‌తో పాదయాత్ర
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్‌కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్
- విడుదలకు ముస్తాబవుతున్న 'బజార్ రౌడి'
- కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి
- ‘కార్తికేయ 2’లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్