– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ నేవూరి ధర్మేందర్ రెడ్డి
– మోత్కూరులో ఉచిత పుస్తకాల పంపిణీ
మోత్కూరు, సెప్టెంబర్ 12 : యువత అన్ని రంగాల్లో ముందుంటూ పోటీ పరీక్షలకు పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా.నేవూరి ధర్మేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో తెలంగాణ మాదిగ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సహకారంతో, SNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా.నేవూరి ధర్మేందర్ రెడ్డి మాట్లాడుతూ… నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యార్థులు, యువత సమయాన్ని వృథా చేయకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. లక్ష్య సాధన కోసం కృషి చేస్తే విజయం తప్పక లభిస్తుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక బాధ్యతతో విద్యార్థులకు చేయూతనందిస్తున్న SNR ఫౌండేషన్ ప్రతినిధులను, అసోసియేషన్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీను, నరేష్, రాంబాబుతో పాటు తెలంగాణ మాదిగ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, మోత్కూరు/అడ్డగూడూరు మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ సోమల్లు, గజ్జి మల్లేష్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పబ్బు ప్రవీణ్, పోన్నెబోయిన మచ్చగిరి కొంపెల్లి, మల్లేష్, బోడిగే మల్లేష్, పబ్బు హనుమయ్య, పాల్గొన్నారు.

‘యువత పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలి’