– సూర్యాపేట సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
అనంతగిరి, సెప్టెంబర్ 12 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్లో శనివారం సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సిపిఐ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటం సాగించారని, ప్రపంచ రైతాంగ పోరాట చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టంగా ఈ చర్యను వారు అభివర్ణించారు. ఫలితంగా వేలాది ఎకరాలు భూమి పేదవాళ్లకు పంచారని, వెట్టిచాకిరీ వ్యవస్థ పూర్తిగా రూపుమాసిపోయిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి ఎర్రసాని రవి, మండల ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి డేగ వీరన్న, శాఖ కార్యదర్శి బత్తిని వీరబాబు, గ్రామ సర్పంచ్ వాడ కొప్పుల ఉమా, ఉప సర్పంచ్ గరిడేపల్లి స్వాతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు నాగభద్రం, విద్యార్థి యువజన సంఘం నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.