CEO Love | అంతా బాగున్నప్పుడు అందలమెక్కించాడు. ప్రియురాలి కళ్లల్లో ఆనందం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. తరువాత విడిపోయారు. కానీ అతడు ప్రియురాలిపై కోర్టు మెట్లెక్కాడు. అతడే సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయ మూలాలు ఉన్న చందర్ అగర్వాల్. ఇతడు TCI ఎక్స్‌ప్రెస్ (ఇండియన్ లాజిస్టిక్స్ కంపెనీ) సంస్థకు సీఈవో, ఎండీ (MD)గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఫెలిసియా లీ అనే మహిళను ప్రేమించారు.
లీ కోసం చందర్ సుమారు 3.70 లక్షల డాలర్లు (రూ. 35 కోట్లు) ఖర్చు చేశారు. వీటిలో ఎక్కువగా Prada, Dior వంటి బ్రాండ్ల లగర్జీ వస్తువులు, ఫస్ట్‌క్లాస్ విమాన టికెట్ ఖర్చులే ఉన్నాయి. కానీ విడిపోయిన తరువాత తాను పెట్టిన ఖర్చులు రాబట్టేందుకు సింగపూర్ హై కోర్టులో దావా వేశారు. కానీ కోర్టు మాత్రం తనంతట తానే ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్‌ల కోసం ఖర్చు చేశారు కాబట్టి తిరిగి ఇచ్చేది లేదని ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ కేసులో ఆయన ఓడిపోయారు.

Singapore High Court
విడిపోవడానికి కారణం
చందర్ 2019లో విమానంలో ప్రయాణించేటప్పుడు ఫ్లైట్ అటెండెంట్ అయిన ఫెలిసియా లీతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి 2022, సెప్టెంబర్ నుంచి 2023, డిసెంబర్ వరకు తమ ప్రేమబంధాన్ని కొనసాగించారు. ఆమె వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో కూడా ఉందన్న అనుమానంతో ఆమె నుంచి చందర్ విడిపోయారు. ఆమెతో ప్రేమలో ఉన్నప్పుడు చందర్ లీ కోసం క్రెడిట్ కార్డు చార్జీలు, విదేశీ పర్యటనలు, ఫ్లాట్ఫెంగ్ షుయ్ మాస్టర్ కోసం, ఇతర వాటి కోసం రూ. 35 కోట్లు ఖర్చు చేశారు. దీంతో విడిపోయిన తరువాత ప్రియురాలిపై కోపంతో తను పెట్టిన ఖర్చులు రాబట్టుకునేందుకు కోర్టులో దావా వేశారు.
సీఈవో విసుగు చెందారు
సింగపూర్ హై కోర్టు సీనియర్ జడ్జి లీ సీయూ కిన్ మాట్లాడుతూ.. చందర్ లీ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమెకు ఇష్టపూర్వకంగా ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. వారి బంధం ముగిసిన తరువాత చందర్ విసుగు చెందిన ఆమె నుంచి ప్రతిఫలం రాబట్టాలని నిర్ణయించుకున్నాడు అని అన్నారు. అతడు చేసిన ఖర్చు రుణం కాదని, బహుమతులు అని, లీ వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని జడ్జి తీర్పు వెల్లడించారు.