Yadadri Lakshmi narasimha swamy | యాదగిరిగుట్ట, మార్చి6 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నేడు (గురువారం) ఆరో రోజున యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుడి చేతిలో పిల్లన గ్రోవి, ఎడమ చేతి చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన స్వామివారిని పట్టుపీతాంబరాలతో అలంకరించి ప్రధానాలయం తిరువీధుల్లో ఊరేగించారు.
ఉత్సవ మండపంలో చతుర్వేదాలు, మూలమంత్రాలు, మూర్తి మంత్రాలు, హోమాలు, సుదర్శన మహామంత్రం, నారసింహ మహామంత్రం, పంచసూక్తాలు, నిత్య లఘు పుర్ణాహుతి, నిత్య పుర్ణాహుతి, వేదాలు, పారాయణాలు, ఇతిహాసాలు గావించారు. పంచసూక్తాలు, ఉపనిషత్తులు పటిస్తూ రుత్వికులు, అర్చకులు ముందు నడుస్తుండగా.. భక్తుల గోవింద నామస్మరణ నడుమ వైభవంగా స్వామివారి సేవ సాగింది.
తూర్పు తిరు మాడవీధుల్లో ప్రత్యేక మండపంలో స్వామివారిని ఆస్థానం చేశారు. స్వామివారి అలంకారమైన నాలుగు వేదాలు, గోవర్ధనగిరిధారి సూక్తులను పఠించారు. దివ్య ప్రబంధంలోని అలంకార వైభవ ప్రాశురాలను పరిస్తూ స్వామివారి అలంకార విశిష్టతను ప్రధానార్చకులు నల్లనఘళ్ లక్ష్మి నరసింహచార్యులు వివరించారు. సాయంత్రం సింహ వాహనంపై స్వామి తిరు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు