బీబీనగర్, ఫిబ్రవరి 10 : ఆర్బిఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కేవైసీ సురక్షిత బ్యాంకింగ్ మీ తొలి అడుగు అనే అంశంతో బీబీనగర్ గ్రామంలో మంగళవారం వాక్ థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలకు కేవైసీ ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు గురించి అవగాహన కల్పించారు. మోసాల నుండి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఐ ఏజిఎం లక్ష్మీ శ్రావ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, సెర్ప్ డీపీఎం(ఫైనాన్స్) వెంకటేశం, బీబీనగర్ ఏపీఎం మీనా, సీసీలు శ్రీలత, నర్మద, సమత, సీబీఓ ఆడిటర్ మాధవి, ఎంఎస్ అధ్యక్షురాలు ప్రజావాణి, పంచాయతీ కార్యదర్శి జాకీరోద్దిన్, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సీఎఫ్ఎల్ కౌన్సెలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

కేవైసీపై అవగాహనకు బీబీనగర్‌లో వాక్‌థాన్