భువనగిరి కలెక్టరేట్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య పనులను సిబ్బంది చేపట్టారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన
అనంతరం 10-30 నిమిషాలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం 10-45నిమిషాలకు ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 11-10నిమిషాలకు ఉత్తమ సేవలు అందించిన పలు శాఖల అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు.