యాదగిరిగుట్ట, ఏప్రిల్23 : అతివేగంతో వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న బైకును ఢీ-కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఉదయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరుకు చెందిన మొరిగాడి పరుశురామ్, మొరిగాడి సంతయ్య ద్విచక్ర వాహనం (టీఎస్30సీ8493) పై 163వ జాతీయ రహదారిపై ఆలేరుకు వెళ్తున్నారు.
మండలంలోని బాహుపేట స్టేజీ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న కారు(టీఎస్03ఈపీ5350) బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడడంతో వారి తలలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందిన్నట్లు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.