భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 29 : జంట నగరాల్లో కురిసిన వర్షానికి మూసి నది పరవళ్లు తొక్కుతుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి జూలూరు -రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జి పైనుండి మూసి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో బీబీనగర్ -పోచంపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు ముందస్తుగా వంతెనకు ఇరువైపులా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. వరద నీటీలో ఎవరు వెళ్లకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. భువనగిరి, బీబీ నగర్ వెళ్లేందుకు వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది.