భూదాన్ పోచంపల్లి, జూలై 10 : పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించిన ఘటన పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులను టాయిలెట్ల పైకి ఎక్కించి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని చీపుర్లు, బకెట్లను అందించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపు మేరకు శుక్రవారం విద్యా సంస్థలను బంద్ చేయించారు. స్థానిక జడ్పీహెచ్ఎస్ లో ఉదయం ప్రార్థన ముగిసిన అనంతరం 9, 10వ తరగతి విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై హెచ్ఎం కృష్ణయ్యను వివరణ కోరగా తాను పిల్లలకు పని చెప్పలేదని, స్కావెంజర్ పని చేస్తుండగా పిల్లలు అక్కడికి వెళ్లారని తెలిపారు.

విద్యార్థులచే టాయిలెట్లు, వాటర్ ట్యాంకులు శుభ్రం