రాజాపేట, నవంబర్ 21 : తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బూరుగు ధర్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డి, బీఆఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉద్యమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. నివాళులర్పించిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, జలసాధన సమితి అధ్యక్షుడు ఎర్ర గోకుల జస్వంత్, రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొంగోని ఉప్పలయ్య, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బూర్గు భాగ్యమ్మ నర్సిరెడ్డి, బూరుగు కరుణాకర్ రెడ్డి, తుర్కపల్లి మండల సెక్రెటరీ జనరల్ పరమేశ్ యాదవ్ ఉన్నారు.