మోటకొండూర్, నవంబర్ 22 : మోటకొండూర్ మండల కేంద్రంలోని శివాలయానికి సంబంధించిన భూమిపై వెంటనే సర్వే నిర్వహించాలని, అట్టి భూమిని గుర్తించి హద్దులు పెట్టాలని కోరుతూ శివాలయ, అయ్యప్ప స్వామి భక్తులు శుక్రవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ నాగదివ్వకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆలయానికి చెందిన సుమారు 3 ఎకరాల భూమి కబ్జాకి గురైందని ఆరోపించారు. ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకున్నట్లు తెలిపారు. కావునా ఈ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం వెంటనే క్షేత్ర స్థాయి సర్వేను చేపట్టాలని కోరారు. భక్తుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు భాస్కరుణి రఘునాథరాజు, ఎగ్గిడి కృష్ణ, గాజుల బాలరాజు, కనపర్తి నాగేశ్వర్ రావు, జీవిలికపల్లి రాములు, సిరబోయిన వెంకట్ మల్లేశ్, బాల్ద నర్సింహులు, తండ మల్లేశ్, వంగాల మల్లేశ్ పాల్గొన్నారు.