IND vs AFG | జూన్‌లో భారత పర్యటనకు అఫ్గనిస్థాన్.. ద్వైపాక్షిక సిరీస్ వేదికలు ఇవే..!
IND vs AFG : స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌తో రేసులో వెనకబడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన.. జూన్‌లో సొంతగడ్డపైనే అఫ్గనిస్థాన్ (Afghanistan)తో తలపడనుంది.
IND vs AFG : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025–27లో భాగంగా భారత జట్టు(India) స్వదేశంలో మరో సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌తో రేసులో వెనకబడిన శుభ్‌మన్ గిల్(Shubman Gill) సేన.. జూన్‌లో సొంతగడ్డపైనే అఫ్గనిస్థాన్ (Afghanistan)తో తలపడనుంది. రెండు ఫార్మాట్ల సిరీస్ కోసం అష్మతుల్లా షాహిదీ సారథ్యంలోని కాబూలీ టీమ్ జూన్‌లో భారత్‌కు రానుంది. ఏకైక టెస్టు మ్యాచ్‌తో ఇరుజట్ల మధ్య సిరీస్ ప్రారంభమవ్వనుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో భారత్, అఫ్గన్ తలపడనున్నాయి
భారత్, అఫ్గనిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ చివరగా 2024లో జరిగింది. అయితే.. ఇరుజట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ఆడి ఆరేళ్లవుతోంది. 2018లో చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య భారత్ చేతిలో కాబూలీ టీమ్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాతో ఏకైక టెస్టు ఆడేందుకు కాబూలీ టీమ్ జూన్‌లో వచ్చేస్తోంది.
🚨 News 🚨
Here’s a look at the schedule for Afghanistan Men’s Team’s tour of India in June 2026 🗓️
Details ▶️ https://t.co/OkJVip4AhJ#TeamIndia | #INDvAFG pic.twitter.com/CQhIliTf2E
— BCCI (@BCCI) March 2, 2026
న్యూ ఛండీగఢ్ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత బృందంతో జూన్ 6వ తేదీన టెస్టు మ్యాచ్‌తో తలపడనుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో భారత్, అఫ్గనిస్థాన్ ఢీ కొంటాయి. తొలి వన్డే జూన్ 14న ధర్మశాలలో.. రెండో వన్డే జూన్ 17న లక్నోలో.. చివరి మ్యాచ్ చెన్నైలో మధ్యాహ్యం 1:30 గంటల నుంచి జరుగుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

