రాజాపేట, ఏప్రిల్ 6 : శ్రీరామనవమి పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాములోడి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని రేణికుంట శ్రీగిరి సంకల్పసిద్ధి వెంకటేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనుల విందుగా తిలకించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ ధర్మకర్తలు రెయిన్బో డెవలపర్స్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Cinnamon | దాల్చిన చెక్కతో ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్యాలకు దీన్ని ఎలా వాడాలంటే..?
Working Hours | దేశంలో సగటు పని గంటలు 7.5.. ఢిల్లీలో అత్యధికంగా 9.5 గంటలు