Working Hours | న్యూఢిల్లీ: భారత్లో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో ప్రజలు అత్యధిక సమయాన్ని తమ ఉద్యోగ కార్యకలాపాల కోసం వెచ్చిస్తున్నట్టు ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్లో సగటున ఉద్యోగి రోజుకు 455 నిమిషాలు అంటే 7.5 గంటలు ఉద్యోగ నిర్వహణలో గడుపుతుండగా ఢిల్లీలో మాత్రం రోజుకు 571 నిమిషాలు లేదా 9.5 గంటలు పనిచేస్తున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు శాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఈ పని గంటలలో ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి తిరిగి రావడానికి ఖర్చవుతున్న సమయాన్ని కూడా కలిపినట్టు టైమ్ యూజ్ సర్వే నివేదిక పేర్కొంది.
ఢిల్లీ – 9.5
హర్యానా – 8.2
తమిళనాడు – 8
ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ – 7